
యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవుళ్లు, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు BNS సెక్షన్లు 352, 79, 299తో పాటు ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్వేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.