తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డీ రెండేళ్ల పాలన పూర్తయ్యిందని పేర్కొన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు సగం కూడా నెరవేరలేదని ఆయన ఆరోపించారు.