
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరగాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి తేడా లేదని హరీష్ రావు విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఒకటేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.