కేటీఆర్ పై రైతు అభిమానం: పొలంలో వరినాట్లతో KTR పేరు

Jul 15, 2021, 9:37 AM IST

మంత్రి కేటీఆర్ మీద ఉన్న అభిమానాన్ని ఓ రైతు సరికొత్తగా చూపించాడు. తనకున్న పొలంలో వరి నాట్లు వేయడానికి వేసిన టువంటి నారు మడిలో ఇంగ్లీషులో మంత్రి కేటీఆర్ అక్షరాల రూపంలో  నారు పోశాడు వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెధిరా  గ్రామం లో అర్జున్ అనే రైతు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మీద ఉన్న అభిమానాన్ని  తన పొలంలో కేటీఆర్ అనే ఇంగ్లీష్ అక్షరాలతో నారు పోసి అభిమానాన్ని చాటుకున్నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి సంక్షేమ పథకాలపై  ఆకర్షితుడనై ఇలా గత రెండు మూడు సంవత్సరాల నుండి పొలంలో నారు మడి లో కేటీఆర్ అక్షరాలతో  పెంచుతున్నానని రైతు అర్జున్ తెలిపాడు