ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదనే కారణంతో ఓ కూతురు అమానుషానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ తన తల్లిదండ్రులకు సూది మందు ఇస్తానని నమ్మించి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.