Jun 11, 2022, 12:18 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడతాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలకు దోహదపడే విదంగా ఎత్తుగడలు ఉండాలని ఆశిద్దామని, ఆ దిశగా కేసీఆర్ చర్యలు తీసుకుంటారని, అందర్నీ కలుపుకుని పోతారని ఆశిస్తున్నానన్నారు.