వేములవాడలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య (వీడియో)

26, Sep 2020, 8:58 PM

వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ఓ వ్యక్తిని నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై శనివారం ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వేములవాడ వాసులు ఉలిక్కిపడ్డారు.