Jul 15, 2022, 1:30 PM IST
నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. గోదావరి వారివాహక గ్రామమైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనను అడ్డుకుని తమ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఎంపీగా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానన్న హామీ, గ్రామంలో ఉన్న మల్లన్న గుట్ట సమస్య పరిష్కరిస్తానన్న హామీ ఏమైందని గ్రామస్థులు నిలదీసారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాల అద్దాలు పగలగొట్టారు.