గౌతమ్ మీనన్ సంచలన వ్యాఖ్యలు: ఇలా అన్నందకు నాపై బ్యాన్ పెట్టేస్తారు

Published : Jan 22, 2025, 02:58 PM IST

తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళ చిత్ర పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేశారు. అధిక బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టడం కంటే మంచి కథలతో సినిమాలు తీయాలని, తమిళ నటులు కథలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

PREV
16
గౌతమ్ మీనన్ సంచలన వ్యాఖ్యలు: ఇలా అన్నందకు నాపై బ్యాన్ పెట్టేస్తారు
Gautham Vasudev Menon

 
యాక్టర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తమిళ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగింంచారు  గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon). అయితే ఆయన గత కొంతకాలంగా అవకాశాల విషయంలో బాగా వెనకపడ్డారు.ఆయన డైరక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. ఈ నేపధ్యంలో ఆయన తమిళ పరిశ్రమపై మండిపడ్డారు. తన మాటలు విన్న తమిళ పరిశ్రమ అవకాశాలు ఇవ్వకపోవచ్చు అని ఆయన కోపంగానే అన్నారు. ఇంతకీ గౌతమ్ ఏమన్నారు.

26
Gautham Vasudev Menon


  ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మలయాళ చిత్రం డొమినిక్‌ అండ్ ది లేడీస్ పర్స్‌ (Dominic and the Ladies’ Purse). మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ జనవరి 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర కామెంట్స్ చేసి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు గౌతమ్‌ మీనన్‌. 

36
will Dominic and The Ladies Purse have a sequel answers gautham vasudev menon


గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ....నిజం చెప్పాలంటే సినిమాలకు భారీ బడ్జెట్‌ అవసరం లేదు. మంచి కంటెంట్‌ అనేది పరిగణలోకి వస్తుంది. రూ.100 కోట్ల సినిమాలు తెరకెక్కించేందుకు బదులు రూ.10 కోట్ల బడ్జెట్‌తో పది సినిమాలు నిర్మించడంపై ఫోకస్ పెట్టాలన్నాడు.

46
mammootty gautham vasudev menon

చాలా మంది తమిళ యాక్టర్లు స్క్రిప్ట్‌తో సంబంధం లేకుండా హై బడ్జెట్‌ సినిమాలపై పనిచేసేందుకు ఇష్టపడుతుంటారన్నాడు గౌతమ్‌ మీనన్‌. చిన్నా పెద్దా హీరోలుకు సంభందం లేకుండా భారీ బడ్జెట్ లు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికీ కంటెంట్ పై ఇష్టం లేదన్నారు.

56
gautham vasudev menon


 నాకొక అవకాశం ఇస్తే.. కథలతో మొదలు.. ప్రతీ విషయాన్ని మాలీవుడ్‌కు తీసుకొస్తా. ఆ కథల్లో సగానికిపైగా సినిమాలు తమిళంలో తెరకెక్కించబడవు. ఒక సినిమా మలయాళంలో సక్సెస్ అయితే దాన్ని తమిళంలో రీమేక్ చేస్తారు. కానీ తమిళ యాక్టర్లు మాత్రం అలాంటి ఒరిజినల్‌ స్క్రిప్ట్‌ను చేసేందుకు ఎప్పుడూ ఒకే చెప్పరు.

66
Gautham Vasudev Menon


ఈ ప్రకటన తర్వాత నేను తమిళ సినిమాల్లో పనిచేయలేకపోవచ్చంటూ కోలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు గౌతమ్‌ మీనన్‌. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Read more Photos on
click me!

Recommended Stories