Jan 3, 2022, 3:28 PM IST
కరీంనగర్: కరోనా నిబంధనలు పాటించకుండా, ఎలాంటి పోలీస్ అనుమతి లేకుండా చేపడుతున్నారంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయతే బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపర్చారు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి జిల్లా కోర్టు వరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సంజయ్ ని తరలించారు.