
మహారాష్ట్రలోని పూణే రూరల్ ప్రాంతంలో చిరుత దాడులు పెరగడంతో పింపర్కేడ్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లేటప్పుడు ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఇనుప ముళ్లతో తయారు చేసిన ప్రత్యేక కాలర్లను ధరించడం ప్రారంభించారు. షిరూర్ తాలూకాలో ఇటీవలి రోజులుగా చిరుత సంచారం పెరగడంతో గ్రామస్థులు తమ భద్రత కోసం తమతమ ప్రయత్నాలు చేస్తుండటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.