
జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, వాణిజ్యం, ఇన్నోవేషన్, గ్లోబల్ ఇష్యూలపై సహకారం వంటి కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై భారత–ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ భేటీ కీలకంగా నిలిచింది.