
హైదరాబాద్‌లో నిర్వహించిన ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన Wings India 2026 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాబోయే రోజుల్లో భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మారబోతోందని ప్రధాని పేర్కొన్నారు. దేశీయ విమానయాన మౌలిక వసతులు, కొత్త విమానాశ్రయాలు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.