Galam Venkata Rao | Published: Feb 10, 2025, 3:01 PM IST
విద్యార్థులకు పరీక్షలే సర్వస్వం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha 2025) కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. చదువు, పరీక్షలను చూసే కోణం మారాలని, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నించాలని సూచించారు.