ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 60 కోట్ల మంది భక్తులు కుంభ మేళాలో పాల్గొన్నట్లు సమాచారం. త్వరలోనే కుంభ మేళా ముగియనుండటంతో భక్తులు భారీగా తరలి వెళుతున్నారు.