Galam Venkata Rao | Published: Mar 22, 2025, 3:00 PM IST
డీ లిమిటేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నేతృత్వంలో జరిగిన డీ లిమిటేషన్ JAC భేటీలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంటు సీట్లలో మార్పులు చేసేలా డీ లిమిటేషన్ చేయొద్దన్నారు. పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించే మొత్తానికి, కేంద్రం తిరిగి ఇస్తున్న నిధులు చాలా వ్యత్యాసం ఉందన్నారు. తెలంగాణ రూపాయి చెల్లిస్తే తిరిగి 42 పైసలే ఇస్తున్నారని... ఉత్తరాదిలోని బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తక్కువ పన్నులు చెల్లిస్తున్నా భారీ మొత్తంలో కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు.