Galam Venkata Rao | Published: Feb 8, 2025, 6:01 PM IST
ఢిల్లీలో 26 ఏళ్ల తరువాత భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మేజిక్ ఫిగర్ (36) బీజేపీ దాటేసింది. మాజీ ముఖ్యమంత్రి, ఆప్ పెద్ద అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితరులు పరాభవం మూటగట్టుకున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయంతో అస్సాంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.