Munugode bypoll 2022: కాంగ్రెస్ కు చావోరేవో, బిజెపికి ఆట

Aug 12, 2022, 10:51 AM IST

మునుగోడు శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఫలితం వచ్చే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష. ఆ స్ధానాన్ని నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓటమి పాలైతే మాత్రం ఆయన అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటారు. బిజెపి విజయం సాధిస్తే ఆ పార్టీకి మరోసారి ఊపు వచ్చే అవకాశం ఉంది. బిజెపి నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆ సీటును గెలుచుకోవడం అత్యంత అవసరంగా మారింది.