Mar 17, 2023, 10:59 AM IST
తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఈడి విచారణకు పిలిచిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనపై మండిపడ్డారు. వీధికెక్కి ఆందోళనలు కూడా చేశారు. అది మామూలే అనుకున్నా బండి సంజయ్ తన సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కున్నారు. బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి ఆరవింద్ బండి సంజయ్ ను తప్పుపట్టారు. మరో వైపు, బిజెపి తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతోషంగా లేరనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అంతర్గత అంశాలను బండి సంజయ్ ఎలా చక్కదిద్దుకుంటారనేది చూడాల్సి ఉంది.