Nov 24, 2023, 1:25 PM IST
ప్రతీ హీరోకు తనను తాను యాక్షన్ హీరోగా చూసుకోవాలని ఉంటుంది. అలాగే దర్శకుడికి యాక్షన్ సినిమా చేస్తేనే నెక్ట్స్ లెవిల్ ఉంటుంది. అందుకోసం యాక్షన్ కథలతో ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మొదలెడతారు. అది కామన్ గా జరిగే విషయమే. అయితే యాక్షన్ సినిమా చేయాలంటే అది ఓ రేంజిలో లేకపోతే ప్రేక్షకుడుకు ఎక్కే పరిస్దితి లేదు. కేవలం కొట్టుకుంటాం,నరుక్కుంటాం అంటే సరిపోదు. అందుకు తగ్గ ఎమోషన్ ఉండాలి. అదీ అంతకు ముందు చూడనదై ఉండాలి. ఆ తరహా ఎమోషనల్ యాక్షన్ ని ఈ సినిమా ఇవ్వగలగిందా, మెగా మేనల్లుడు యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి..అసలు ఈ సినిమా కథేంటి, డైరక్టర్ ఇంటర్వూలో చెప్పినట్లు ట్యూబ్ లైట్ సీన్ థియేటర్ లో బాగా పేలిందా ఇవన్నీ పబ్లిక్ టాక్ లో చూద్దాం.