లవ్ స్టోరీ కీలక పాయింట్ లీక్... అది గాని కనెక్ట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది..!

Sep 9, 2021, 2:07 PM IST

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేసారు. ఆ తర్వాత వినాయక చవితి సందర్బంగా సినిమా రిలీజ్ చేస్తామన్నారు కానీ అదీ జరగలేదు. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు.  ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల సమస్య కొలిక్కి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి.