మరోసారి అద్భుతమైన సినిమాతో ముందుకొచ్చిన అల్లరి నరేష్...కామెడీ పక్కన పెట్టేసినట్టేనా..?

Nov 25, 2022, 2:31 PM IST

అల్లరి నరేష్ సినిమాలు అంటేనే కామెడీ. అలాంటి నరేష్ వరుస పరాజయాలు చవిచూడటం తో రూటు మార్చి చేసిన నాంది సినిమా హిట్ తో పాటు నటుడిగా మంచిపేరుని కూడా తీసుకొచ్చింది..ఆ తరువాత అదే పంధాని కొనసాగిస్తూ మరోచిత్రం తో ముందుకొచ్చాడు. అదే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా. ఓటు హక్కు గురించి తెలియచెప్పే విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ సీరియస్ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా లేక ఆలోచన రేకెత్తించేలా ఉందా, ఈ చిత్రం తో మరో హిట్ కొట్టినట్టేనా అనే విషయాలు మనం ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం...