Jan 5, 2021, 7:08 PM IST
మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో మొదలైన బొమ్మ అదిరింది షోకి తెరపడిందని టాక్ వినిపిస్తుంది. అనుకున్నంత ఆదరణ దక్కని నేపథ్యంలో నాగబాబు బొమ్మ అదిరింది టాక్ షోకి చరమ గీతం పాడాడని టాలీవుడ్ కోడై కూస్తుంది. గత రెండువారాలుగా బొమ్మ అదిరింది షో ప్రసారం నిలిచిపోవడమే దీనికి కారణం.