Jan 28, 2021, 2:40 PM IST
నాగ చైతన్య... అక్కినేని నట వారసుడిగా రంగప్రవేశం చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే తన 12 సంవత్సరాల సినీ కెరీర్ లో ఈ యువనటుడు ఒక స్టార్ గా మాత్రం తనను ప్రూవ్ చేసుకునే సినిమా అయితే ఇప్పటివరకు చెయ్యలేకపోయాడనే చెప్పొచ్చు..కెరీర్ ఆరంభం నుండి విభిన్నమైన చిత్రాలే చేస్తున్నా వాటిలో హిట్ మూవీస్ ఉన్నా కూడా ఎందుకో స్టార్ డం మాత్రం అందుకోలేకపోయారు నాగ చైతన్య.. ఏం మాయ చేసావే...100 % లవ్ లాంటి హిట్ చిత్రాలు చేసిన ఆయా హిట్స్ వల్ల ఆయా చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ కి మాత్రం స్టార్ డం దక్కింది..నాగ చైతన్య కి మాత్రం పెద్దగా హెల్ప్ కాలేదు..మజిలీ చిత్రం తో ఒక హిట్ ఈ మధ్య కాలంలో అందుకున్న ఈ జూనియర్ నాగ్ నెక్స్ట్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ చిత్రం తో ప్రేక్షకులని పలకరించనున్నారు..తండ్రి లానే తను కూడా లవర్ బాయ్ ని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నాగ చైతన్య గురించి ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తుంది..