టీమిండియా కమ్‌బ్యాక్ పర్ఫామెన్స్ WWE స్క్రిప్ట్‌లా అనిపించింది... WWE స్టార్ త్రిబుల్ హెచ్.

Jan 23, 2021, 6:20 PM IST

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు ఇక్కడ ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ‘ది రాక్’ డ్వేన్ జోన్స్, త్రిబుల్ హెచ్, అండర్ టేకర్‌ లాంటి ఎందరో స్టార్లకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్లు క్రికెట్ చూస్తారా? ఇంతకుముందైతే ఏమో కానీ ఇప్పుడు మాత్రం భారత క్రికెట్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, రెజ్లర్ త్రిబుల్ హెచ్, తాను టీమిండియా ఆటకు ఫ్యాన్ అయ్యానంటూ స్వయంగా ప్రకటించాడు.