తూ.గో జిల్లాలో దారుణం... మహిళపై వైసిపి వర్గీయుల దాడి

తూ.గో జిల్లాలో దారుణం... మహిళపై వైసిపి వర్గీయుల దాడి

Published : Mar 22, 2023, 10:13 AM IST

రాజమండ్రి : అధికారుల సాయంతో తన సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులు అడ్డుకున్నారని... ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి దిగారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

రాజమండ్రి : అధికారుల సాయంతో తన సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులు అడ్డుకున్నారని... ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి దిగారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  పోలీసులు కూడా దాడిచేసిన వారిపై కాకుండా తననే నిర్భంధించారని... న్యాయం చేయాలంటూ మహిళ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. 

అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన సుగుణ వరలక్ష్మి ఇంటి ఆవరణలో విద్యుత్ స్తంభం వుండేది. అయితే అధికారుల చుట్టూ తిరిగి ఎలాగోలా స్తంభాన్ని తన స్థలం నుండి తీసేయించుకున్నారు. ఈ విషయంలో అధికార వైసిపి సర్పంచ్ కాంతమ్మకు, వరలక్ష్మికి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే తన వర్గీయులతో ఇంటివద్దకు చేరుకున్న కాంతమ్మ దాడికి తెగబడ్డారని వరలక్ష్మి చెబుతున్నారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమనే నిర్బంధించారని బాధిత మహిళ వాపోయింది. విషయం తెలిసి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని బాధిత మహిళకు అండగా ఆందోళనకు దిగారు. చివరకు ఇరువు వర్గాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.

34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu