Apr 18, 2022, 11:54 AM IST
విజయవాడ: పల్నాడు జిల్లా గురుజాల రైల్వేస్టేషన్లో మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు. ఇలా గురజాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్యం అందిచాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. వారికి విధించే శిక్ష ఇకపై ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి గుణపాఠంగా మారాలన్నారు. మహిళ ఆఛూకీ తెలుసుకుని కుటుంబం వద్దకు చేరుస్తామని... ఇందుకోసం రైల్వే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సహకరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.