ఆ సాంగ్స్ లో నటించి తప్పు చేశా, అందుకే పెళ్లి కావట్లేదు..ఖుషి, అత్తారింటికి దారేది చిత్రాల నటి కామెంట్స్

Published : Jan 22, 2025, 02:18 PM IST

ప్రస్తుతం ముంతాజ్ సినిమాలకు దూరంగా ఉంటోంది. తాను సినిమాలకు దూరం కావడానికి కారణం తనలో వచ్చిన మార్పు అని ముంతాజ్ చెబుతోంది.

PREV
15
ఆ సాంగ్స్ లో నటించి తప్పు చేశా, అందుకే పెళ్లి కావట్లేదు..ఖుషి, అత్తారింటికి దారేది చిత్రాల నటి కామెంట్స్

చిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు హీరోయిన్లుగా రాణిస్తారు. మరికొందరు హీరోయిన్ కావాలని కలలు కన్నప్పటికీ ఆ ఛాన్స్ రాదు. మరొక రూపంలో చిత్ర పరిశ్రమలో రాణించే అవకాశం వారికి వస్తుంది. హంసా నందిని, రాయ్ లక్ష్మి లాంటి వారు ఆ కోవకి చెందిన నటీమణులే. గతంలో వీరి తరహాలో సాంగ్స్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న నటి ముంతాజ్. 

 

25

చాలా చిత్రాల్లో ఆమె అప్పట్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలో గెస్ట్ రోల్ తో పాటు గ్లామరస్ సాంగ్ లో మెరిసింది. తమిళ చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. బోల్డ్ గా కనిపిస్తూ యువతలో బాగా పాపులర్ అయింది. ఖుషి తర్వాత చాలా ఏళ్ళకి మరోసారి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. మహేష్ బాబు ఆగడు చిత్రంలో కూడా నటించింది. చివరగా ఆమె టామీ అనే చిత్రంలో మెరిసింది. 

 

35

ప్రస్తుతం ముంతాజ్ సినిమాలకు దూరంగా ఉంటోంది. తాను సినిమాలకు దూరం కావడానికి కారణం తనలో వచ్చిన మార్పు అని ముంతాజ్ చెబుతోంది. నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. అప్పట్లో నాకు ఖురాన్ అర్థం అయ్యేది కాదు. అందులో అంతరార్థం తెలుసుకున్న తర్వాత నాలో మార్పు మొదలయింది. ఇకపై సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లు ముంతాజ్ పేర్కొంది. ముంతాజ్ మూడు సార్లు మక్కా సందర్శించింది అట, హిజాబ్ ధరిస్తుంది. 

45

తాను చేసిన పాత్రలపై, స్పెషల్ సాంగ్స్ పై ముంతాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు ఏమి అర్థం కానీ వయసులో గ్లామర్ పాత్రలు చేశాను. స్పెషల్ సాంగ్స్ లో నటించాను. అప్పుడు ఎలాంటి భయం ఉండేది కాదు. అందుకే ఇష్టం వచ్చినట్లు గ్లామర్ రోల్స్ చేశాను. అలా చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నా. 

55

నా కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో నా సాంగ్స్ నేను చూడలేకపోతున్నా. అతిగా గ్లామర్ ప్రదర్శించడం వల్ల ఇబ్బందిగా ఉంటోంది. అలాంటి సాంగ్స్ లో ఎందుకు నటించానా అని అనిపిస్తోంది. శృంగార భరితంగా కొన్ని పాత్రలు చేశాను. ఆ ఫోటోలని ఇంటర్నెట్ నుంచి తొలగించాలని ప్రయత్నించా. కానీ కుదర్లేదు. నేను చేసిన పాత్రల వల్ల పెళ్లి  చేసుకోవడం కూడా సాధ్యపడలేదు అని ముంతాజ్ బాధపడింది. తాను మరణించిన తర్వాత తన బోల్డ్ ఫొటోస్ ఎవరూ షేర్ చేయొద్దు అని రిక్వస్ట్ చేసింది. 

click me!

Recommended Stories