ప్రజలకు కనీస సమాచారమివ్వకుండానే విదేశీ పర్యటలకు వెళ్ళిన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తీరుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఆక్షేపించారు. కాకినాడలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేష్ ల రహస్య విదేశీ పర్యటన ప్రజలను గందరగోళంలోకి నెట్టిందని మండిపడ్డారు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ... తమ పర్యటన వివరాల్లో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీశారు.