May 13, 2022, 5:23 PM IST
విశాఖపట్న: పెళ్లి పీటలపైనే నవవధువు హఠాన్మరణం చెందిన ఘటన విశాఖపట్నం మధురవాడలో చోటుచేసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారి యువతి మృతిపై ఏదేదో ప్రచారం జరుగుతోంది. దీంతో తన సోదరి మృతికి సంబంధించిన వివరాలను మృతురాలి సోదరుడు విజయ్ మీడియాకు వెల్లడించారు. పెళ్లికూతురు సృజన ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సోదరుడు ఖండించాడు. తన సోదరికి ఎవ్వరితోనూ ఎటువంటి అపైర్స్ లేవని... ఆమె ఇష్టపూర్వకంగానే వివాహం నిశ్చయించామన్నారు. పెళ్లికి ముందు నెలసరి రాకుండా ట్యాబ్లెట్లు వాడిందని... అందువల్లే రెండురోజులుగా సోదరి ఇబ్బంది పడినట్లు తెలిపారు. అయితే ఆమె హఠాన్మరణానికి కారణమేంటో తమకూ తెలియడం లేదన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని... అప్పటివరకు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజయ్ కోరాడు.