శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించేందుకు TTD చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెనూలో ఒక ఐటమ్ పెంచాలని అధికారులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. చైర్మన్ అదేశానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ట్రయల్ రన్ లో భాగంగా తొలుత 5వేల మసాలా వడలు భక్తులకు వడ్డించారు. ఈ మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.