తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నుంచి బయటపడాలని చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసినదని అబద్ధం ప్రచారం చేశారని మండిపడ్డారు.