అమరావతి : హైకోర్టు తీర్పుతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయిన సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నారు.
అమరావతి : హైకోర్టు తీర్పుతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ పదవి కోల్పోయిన సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నారు. డిఓపిటి ఆదేశాలతో ఏపీ ప్రభత్వానికి రిపోర్ట్ చేసేందుకు ఇవాళ విజయవాడకు చేరుకున్న సోమేష్ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఏపీ సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరమే సోమేష్ కుమార్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.