జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పై అతని స్నేహితురాలు లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. సెటిల్‌మెంట్ వీడియో కోసం తన కాళ్లు పట్టుకుని బతిమిలాడాడని ఆరోపించారు. కిరణ్ రాయల్‌కి తాను ఇచ్చిన డబ్బు రూ.1.20 కోట్లు అని... గత ఎన్నికల ముందు అతని రాజకీయ జీవితం నాశనం అయిపోతుందంటూ రూ.30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. మొదట తాను ఒప్పుకోలేదని.. పిల్లల బలవంతంపై ఒప్పుకున్నానని తెలిపారు. అయితే, ఒప్పందం తర్వాత డబ్బు ఇవ్వకుండా మళ్లీ బెదిరింపులకి దిగాడని ఆరోపించారు.