Dec 20, 2022, 3:56 PM IST
గుంటూరు : రోగులకు ఇబ్బందిపెడుతూ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఏమిటంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగారు. వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా గుంటూరు హాస్పిటల్ సిబ్బంది గంటల తరబడి వేడుకలు జరుపుకోవడం వివాదానికి దారితీసింది. ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తితో వాగ్వాదానికి దిగుతూ హాస్పిటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో సదరు వ్యక్తి సిబ్బంది తీరును వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం తప్పుకాదు... కానీ వైద్యంకోసం వచ్చినవారిని గాలికొదిలేసి వేడుకలు జరుపుకున్న సిబ్బంది తీరు వివాదాస్పదం అవుతోంది.