విజయవాడలో ఉద్రిక్తత... రోడ్డుపైనే పట్టుకుని విఎంసి సిబ్బందిపై వ్యాపారుల దాడి

May 26, 2022, 3:05 PM IST


విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై వ్యాపారులు దాడికి పాల్పడ్డారు. నగరంలోని కేదారేశ్వరపేట మామిడికాయలు పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యాపారాలు చేస్తున్నారని... దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగుతోందని విఎంసి కమిషనర్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ఆక్రమణల నిర్మూలన దళ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వారి వస్తువులను రోడ్డుపై నుండి అధికారులు తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యాపారులు విఎంసి సిబ్బందిపై దాడికి చేశారు. ఇలా కేదారేశ్వరపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.