లారీ, కారు, బైక్ ఢీ... హోంగార్డు మృతి, కొన ఊపిరితో కానిస్టేబుల్

Jul 6, 2021, 11:02 AM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నైట్ బీట్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ అయ్యప్ప, హోంగార్డు రవి నాయక్ ప్రయాణిస్తున్న బైక్ ఢీకొన్న బొలెరో వాహనం ఢీకొట్టింది. వేగంగా వచ్చిన ఓ లారీ బొలెరో కారును ఢీకొట్టగా అదికాస్తా బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు, కానిస్టేబుల్ ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హోంగార్డు అయ్యప్ప మృతిచెందగా కానిస్టేబుల్ రవి నాయక్ కొన ఊపిరితో చికిత్స పొందుతున్నాడు.