Jan 20, 2021, 3:09 PM IST
విజయవాడ: గొల్లపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షకు దిగడంతో ఆయన నివాసంతో పాటు వన్ సెంటర్ లో పోలీసులతో ఐదంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఉమాని పరామర్శించేందుకు వచ్చిన టిడిపి నాయకులు పిల్లి మాణిక్యాలరావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పిల్లి మాణిక్యాలరావు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మాణిక్యాలరావుతో పాటు పలువరు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు.