జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వస్తానంటే అమ్మానాన్న పిచ్చోడన్నారని చెప్పారు. ఈయనొక్కడే నమ్మారంటూ ప్రొఫెసర్ ని వేదికపైనే పరిచయం చేశారు పవన్ కళ్యాణ్.