కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టుబడిదారులను వేధించిందని, కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని, దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణానికి ఇది బలమైన అడుగని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.