ఏపీ కూటమి నాయకుల్లో చీలికలు మొదలయ్యాయా? తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఎవరినీ వదిలిపెట్టనని టీడీపీ మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు. “నేను మంత్రి అయినప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్లలేదు. కానీ కొంతమంది కావాలని నా నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు. నన్ను గెలికితే మీరే ఇబ్బంది పడతారు, నా స్ట్రాటజీలు తట్టుకోలేరు” అంటూ మండిపడ్డారు.