Mar 15, 2023, 11:38 AM IST
అమరావతి : ప్లకార్డు ప్రదర్శిస్తూ అసెంబ్లీలో నిరసనకు దిగిన వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సజావుగా సాగే శాసనసభలో గందరగోళం సృష్టించాలన్న దురుద్దేశ్యంతోనే శ్రీధర్ రెడ్డి వచ్చారని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి... ఇలాంటి నైతిక విలువలు లేని శాసనసభ్యులు లేకుండా చేస్తామంటూ మంత్రి అంబటి హెచ్చరించారు. కేవలం చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మెప్పు పొందడానికే కోటంరెడ్డి సభా సమయాన్ని వృదా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు.