ఏపీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు పరేడ్ ఆకట్టుకుంది.