నిర్లక్ష్యానికి పరాకాష్ట... అంగన్వాడీ పాల పాకెట్ లో కప్ప, బాలింత భయాందోళన

Dec 16, 2020, 3:09 PM IST

అనంతపురం జిల్లాలోని విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన విజయ వజ్ర పాల ప్యాకెట్ లో కప్ప దర్శనమిచ్చింది. దీంతో అంగన్వాడీ లబ్ధిదారులు భయాందోళనకు గురయ్యారు. రాయదుర్గం మండలం రాయంపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.