
విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఎం.కె. బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలపై ఆయన సమీక్షించారు.