Feb 19, 2020, 3:10 PM IST
కృష్ణాజిల్లా, చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామానికి చెందిన నాగుల్ మీరా అనే రైతు తహసిల్దార్ ఆఫీసు మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేశాడు. లంక భూముల్లో పంట పండించుకోమని తహసిల్దార్ తమకు ఇచ్చిన ఎకరం భూమిలో పక్కా ఇళ్ల కోసం మట్టి తీస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనివల్ల తన జీవనాధారం కోల్పోతున్నానని, తన సమస్యకు పరిష్కారం సూచించాలని నాగుల్ మీరా అనే రైతు డిమాండ్ చేస్తున్నాడు.