ఏలూరు కార్పోరేషన్ తొలి ఫలితం... పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి దే ఆధిక్యం

Jul 25, 2021, 11:16 AM IST

అమరావతి: అడ్డంకులన్ని తొలగిపోవడంతో ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 4 కేంద్రాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది. అయితే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా వైఎస్సార్సీపీ ఆధిక్యం సాధిచింది. వైఎస్సార్సీపీ 11, టీడీపీ-1, 
నోటా -1, చెల్లనవి - 2 వచ్చాయి. 

ఏలూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవమవగా 47డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబుల్‌ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపును రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 250 మంది సిబ్బంది నియామించారు. ఈ లెక్కింపును డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారితో పాటు పురపాలక అధికారి పర్యవేక్షించనున్నారు.