Aug 29, 2022, 10:36 AM IST
విశాఖపట్నం : రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు తాగుబోతును అతి కిరాతకంగా హతమార్చిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరగింది. తాగుబోతును తరిమి తరిమి చంపిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. మృతుడు గొంతిన శీను పెయింటర్ వైజాగ్ అల్లిపురం ప్రాంతానికి చెందిన గౌరి అనే మహిళ ఆదివారం ఉదయం పనిపై బయటకు వచ్చింది. ఇదే సమయంలో గొంతిక శీను అనే పెయింటర్ మద్యంమత్తులో వుండి రోడ్డుపై వెళుతున్న ఆమెపై అసభ్యకర కామెంట్స్ చేసాడు. అంతటితో ఆగకుండా మహిళతో రోడ్డుపైనే గొడవకు దిగాడు. దీంతో గౌరి తన కొడుకు సమాచారమివ్వగా ఆవేశంలో అక్కడికి చేరుకున్నాడు. యువకున్ని చూసి శీను పారిపోగా వెంటపడి పట్టుకున్నాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే పెద్ద బండరాయిని శ్రీనుపై వేసి అతి కౄరంగా చంపాడు యువకుడు. అంతేకాదు మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ వచ్చి తల్లి కాళ్లదగ్గర పడేసాడు. ఈ ఘటనతో విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.