విశాఖపట్నం: సముద్రపు అలలపై తేలియాడుతూ కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అద్భుత అవకాశం విశాఖవాసులకు దక్కనుంది.
విశాఖపట్నం: సముద్రపు అలలపై తేలియాడుతూ కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అద్భుత అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో విహరించేందుకు సకల సౌకర్యాలతో కూడిన భారీ క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ విశాఖకు చేరుకుంది. ఈ నౌక ఇవాళ వైజాగ్ నుంచి బయలుదేరి పుదుచ్చేరి, చెన్నై మీదుగా మూడురోజులు ప్రయాణించి తిరిగి వైజాగ్ చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ షిప్ విశాఖకు చేరుకున్న సందర్భంగా బ్యాండ్ మేళాలతో ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు. ప్రయాణికులు ఆనందంగా నృత్యాలు చేస్తూ సముద్రయానానికి బయలుదేరారు. 796 క్యాబిన్లు, 313 ఇన్‌సైడ్ స్టేట్ రూమ్స్, 414 ఓషన్ వ్యూ రూమ్స్, 63 బాల్కనీ రూమ్స్, 5 సూట్ రూమ్‌లతో పాటు ఒక లగ్జరీ సూట్ రూమ్, ఫుడ్ కోర్టులు, 3 స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షోలు ఇలా సకల సౌకర్యాలతో కూడిన క్రూయిజ్ లో ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు సిద్దమయ్యారు.