Jan 5, 2021, 10:22 AM IST
విజయనగరం జిల్లాలోని పురాతన హిందూ దేవాలయం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో హిందూ సంఘాలు, రాజకీయ పక్షాలు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలోనే బిజెపి, జనసేన పార్టీలు ఇవాళ(మంగళవారం) సంయుక్తంగా చలో రామతీర్థంకు పిలుపునిచ్చాయి. అయితే ఇవాళ ఉదయం నుండి విశాఖ నుండి రామతీర్థం వెళ్లే ముఖ్య నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్ద అడ్డుకుంటున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కు సెక్షన్ 151 ప్రకారం నోటీసులు అందజేసి ఇంటి నుండి బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వ చర్యల పై విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.